Telugu Global
Cinema & Entertainment

Dasara Movie - నాని మూవీ థియేట్రికల్ ట్రయిలర్ రెడీ

Nani's Dasara Movie - దసరా సినిమా ట్రయిలర్ రెడీ అయింది. మరో 2 రోజుల్లో రిలీజ్ కాబోతోంది.

Dasara Movie: నాని సినిమా కోసం భారీ విలేజ్ సెట్
X

Dasara Movie: నాని సినిమా కోసం భారీ విలేజ్ సెట్

నాని నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ 'దసరా'. శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ ఈ సినిమాలో నానికి జోడిగా నటిస్తోంది.

ఈ సినిమా ప్రచారం ఇప్పటికే పీక్ స్టేజ్ లో నడుస్తోంది. సాంగ్స్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ దసరా ట్రైలర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మార్చి 14న దసరా ట్రైలర్ ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. రావణ దహనం జరుగుతుండగా నాని గొడ్డలి పట్టుకొని ఎదురుగా నిలుచున్న పవర్ ఫుల్ పోస్టర్ క్యూరియాసిటీని పెంచింది.

దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలలో కనిపించనున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇతడి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ అవుతుందంటున్నాడు నాని.

దసరా మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ సినిమాపై నాని చాలా హోప్స్ పెట్టుకున్నాడు.




First Published:  12 March 2023 2:54 PM GMT
Next Story