Telugu Global
Cinema & Entertainment

Nani's Dasara Movie Update: దసరా సినిమా షూటింగ్ అప్ డేట్

Nani's Dasara Movie shooting updates నాని హీరోగా నటిస్తున్న దసరా మూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది.

Nanis Dasara Movie Update: దసరా సినిమా షూటింగ్ అప్ డేట్
X

నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం 'దసరా' మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్‌కి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ధూమ్ ధామ్ పాటకు అద్భుతమైన స్పందన వచ్చింది.


తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి కావడంతో చిత్రబృందం ప్రమోషన్స్ ని దూకుడుగా చేస్తోంది.

ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలో తన లుక్‌ అందరినీ ఆశ్చర్యపరిచింది.


శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.


సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నాడు. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు. దసరా చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

First Published:  15 Jan 2023 9:34 AM GMT
Next Story