Telugu Global
Cinema & Entertainment

Saripodhaa Sanivaaram | అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేసిన నాని

Saripodhaa Sanivaaram Movie: నాని హీరోగా రాబోతున్న సినిమా సరిపోదా శనివారం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైంది.

Saripodhaa Sanivaaram | అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేసిన నాని
X

Saripodhaa Sanivaaram | అప్పుడే మరో సినిమా స్టార్ట్ చేసిన నాని

Saripodhaa Sanivaaram | నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో రెండో సినిమాగా వస్తున్న 'సరిపోదా శనివారం' గత నెలలో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. నానిని యాక్షన్ అవతార్‌లో ప్రజెంట్ చేసిన యూనిట్, ఓపెనింగ్ సందర్భంగా విడుదల చేసిన వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తాజాగా హైదరాబాద్‌లో యాక్షన్ ఎపిసోడ్‌తో ప్రారంభమైంది. రామ్-లక్ష్మణ్ మాస్టర్లు ఈ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో యాక్షన్‌తో పాటు కొంత టాకీ పార్ట్‌ కూడా తీయబోతున్నారు. నానితో పాటు సినిమాలోని ప్రధాన ఆర్టిస్టులు షూటింగ్‌లో భాగం కానున్నారు.

నాని రగ్గడ్ లుక్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్. తమిళ స్టార్ నటుడు ఎస్‌జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం అతడు, ఇందులో విలన్. సెన్సేషనల్ కంపోజర్ జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా, మురళి జి సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు.

పాన్ ఇండియా మూవీ 'సరిపోదా శనివారం' తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఓవైపు హాయ్ నాన్న సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలా కొత్త సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చాడు నాని. కెరీర్ లో గ్యాప్ అన్నదే లేకుండా దూసుకుపోతున్నాడు.

First Published:  15 Nov 2023 3:59 PM GMT
Next Story