Telugu Global
Cinema & Entertainment

Hero Nani - అది రిస్క్ కాదు, నా అలవాటు అంటున్న నాని

Nani - కొత్త దర్శకులకు ఎక్కువగా ఛాన్స్ ఇచ్చే హీరో నాని. దీనిపై అతడు తాజాగా స్పందించాడు.

Hero Nani - అది రిస్క్ కాదు, నా అలవాటు అంటున్న నాని
X

స్టార్ డైరక్టర్స్ కంటే, కొత్త దర్శకులతో పని చేసిన సినిమాలే నాని కెరీర్ లో ఎక్కువగా కనిపిస్తాయి. అయితే దీన్ని రిస్క్ గా ఫీల్ అవ్వడం లేదు నాని. నిజానికి ఓ కొత్త దర్శకుడితో పనిచేస్తున్నప్పుడు రిస్క్ అనే ఆలోచన తన మైండ్ లోకి రాదంటున్నాడు. అది తనకు ఓ అలవాటుగా మారిపోయిందని చెబుతున్నాడు.

త్వరలోనే దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు నాని. ఈ సినిమాలో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది దసరా. అయినప్పటికీ, అంత పెద్ద ప్రాజెక్టును శ్రీకాంత్ చేతిలో పెట్టాడు నాని.

తను కొత్త-పాత చూడనని, టాలెంట్ ఉందా లేదా అని మాత్రమే చూస్తానని నాని అంటున్నాడు. తన దగ్గరకు వచ్చే దర్శకుడిలో టాలెంట్ ఉందని నమ్మితే అవకాశం ఇస్తానని అంటున్నాడు.

దసరా సినిమా స్టార్ట్ అవ్వడానికి ముందు, దర్శకుడు శ్రీకాంత్ ఓదెలకు కొంత ఎమౌంట్ ఇచ్చి టెస్ట్ షూట్ చేసుకొని రమ్మన్నాడట నాని. ఆ టెస్ట్ కట్ లో విజువల్స్ చూసి వెంటనే శ్రీకాంత్ దర్శకత్వంలో దసరా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట.

First Published:  21 March 2023 2:53 AM GMT
Next Story