Telugu Global
Cinema & Entertainment

Nani | పవన్ కల్యాణ్ దర్శకుడితో నాని సినిమా

Nani - సుజీత్ దర్శకత్వంలో తన నెక్ట్స్ మూవీ చేయబోతున్నాడు నాని. ఈరోజు అధికారిక ప్రకటన వచ్చింది.

Nani | పవన్ కల్యాణ్ దర్శకుడితో నాని సినిమా
X

తన పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటించాడు హీరో నాని. సుజీత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ మూవీ చేయబోతున్నాడు ఈ హీరో. ఈరోజు ఈ సినిమాను ఘనంగా ప్రకటించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించబోతున్నాడు.

ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా కథలు ఎంచుకుంటాడు నాని. దసరా లాంటి రస్టిక్ సినిమా తర్వాత హాయ్ నాన్న లాంటి క్లాస్ మూవీ తీశాడు. ఇప్పుడు సరిపోదా శనివారం అనే యాక్షన్ మూవీ చేస్తున్నాడు. అయితే ఈ యాక్షన్ మూవీ తర్వాత ,సుజీత దర్శకత్వంలో కూడా యాక్షన్ సినిమానే అతడు సెలక్ట్ చేసుకోవడం విశేషం.

పాన్ ఇండియా అప్పీల్ రావాలంటే యాక్షన్ సినిమాలు చేయాల్సిందే. ప్రస్తుతం నాని కూడా అదే పనిలో ఉన్నట్టు కనిపిస్తోంది. హింసాత్మకంగా ఉండే ఓ వ్యక్తి ఒక్కసారిగా అహింస వైపు అడుగులువేస్తే, అతడి జీవితం ఎలా తలకిందులైందో, సుజీత్ సినిమాలో చూపించబోతున్నారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో ఓజీ సినిమా చేస్తున్నాడు సుజీత్. ఆ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే నానితో సెట్స్ పైకి వెళ్తాడు. 2025లో ఈ కొత్త సినిమా విడుదల కానుంది.

First Published:  24 Feb 2024 4:36 PM GMT
Next Story