Telugu Global
Cinema & Entertainment

#Nani30 - నాని కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్

Nani - హీరో నాని శౌర్యువ్ దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అప్ డేట్స్ చెక్ చేద్దాం

#Nani30 - నాని కొత్త సినిమా షూటింగ్ అప్ డేట్స్
X

కెరీర్ లో 30వ సినిమాలోకి అడుగుపెట్టాడు నాని. నూతన దర్శకుడు శౌర్యువ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. గోవాలో లాంగ్ షెడ్యూల్ తర్వాత, మేకర్స్ ఇప్పుడు ముంబై షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు. కూనూర్‌లో నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు.

మేకర్స్ విడుదల చేసిన ఒక చిన్న వీడియోలో నాని తన ముఖాన్ని హూడీతో కప్పుకుని సముద్రపు ఒడ్డున నడుస్తున్నట్లు కనిపించాడు. తర్వాత కూనూర్‌లో ఒక అందమైన లొకేషన్ కనిపించింది. అలా ముంబయి నుంచి కూనూర్ కు షిఫ్ట్ అవుతున్నట్టు విభిన్నంగా వెల్లడించారు.

సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, తీగల విజయేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తండ్రి-కూతురు ఎమోషనల్ బాండింగ్ తో వస్తున్న ఈ సినిమాను.. డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నారు.



First Published:  2 Jun 2023 2:43 AM GMT
Next Story