Telugu Global
Cinema & Entertainment

#Nani30 | రేపే నాని సినిమా ఫస్ట్ లుక్

#Nani30 - కెరీర్ లో నాని 30వ సినిమా మైలురాయికి చేరుకున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ అవుతుంది.

#Nani30 | రేపే నాని సినిమా ఫస్ట్ లుక్
X

హీరో నాని తన కెరీర్ లో ప్రతిష్టాత్మక 30వ సినిమా మైలురాయికి చేరుకున్నాడు. కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. ఇందులో నాని డిఫరెంట్ లుక్, క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కి సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. నాని 30వ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్ రేపు రిలీజ్ అవుతోంది. ఈ మేరకు పారా గ్లైడింగ్ చేస్తూ, ఓ వీడియో తీసి రిలీజ్ చేశాడు నాని. మరొక వీడియోలో మృనాల్ ఠాకూర్ కూడా ఇదే అనౌన్స్ మెంట్ చేస్తూ "ప్రవహించే సముద్రంలా, ప్రేమ మమ్మల్ని చుట్టుముట్టింది, మిమ్మల్ని చేరుకుంటుంది." అని కోట్ చేసింది.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు హృదయం ఫేమ్‌ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

డిఫరెంట్ స్టొరీ లైన్ తో పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని ఎమోషనల్ గా చూపించబోతున్నాడు దర్శకుడు.

First Published:  12 July 2023 3:10 AM GMT
Next Story