Telugu Global
Cinema & Entertainment

Nani | పాన్ ఇండియా కోసం ఆ పని చేయలేదు

Nani - పాన్ ఇండియా అప్పీల్ కోసం పలు భాషలకు చెందిన నటీనటుల్ని హాయ్ నాన్న సినిమాలోకి తీసుకోలేదంటున్నాడు హీరో నాని. దాని వెనక రీజన్ బయటపెట్టాడు.

Nani | పాన్ ఇండియా కోసం ఆ పని చేయలేదు
X

నాని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హాయ్ నాన్న. పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా. ఇందులో సౌత్-నార్త్ కు చెందిన చాలామంది నటీనటులున్నారు. మరి వీళ్లందర్నీ తీసుకోవడానికి కారణం ఏంటి.. కేవలం పాన్ ఇండియా అప్పీల్ కోసమే ఈ పని చేశారా? దీనికి నాని సమాధానం ఇచ్చాడు.

హాయ్ నాన్న సినిమాకు పాన్ ఇండియా అప్పీల్ ఇచ్చేందుకు ఇలా పరభాషా నటుల్ని తీసుకున్నారనే వాదనను హీరో నాని ఖండిస్తున్నాడు. ఇందులో తెలుగు-హిందీ-తమిళ్.. ఇలా అన్ని భాషల నటులు ఉన్నారని... పాత్రకు ఎవరు సరిపోతారో వారినే తీసుకున్నామని చెబుతున్నారు. పాన్ ఇండియా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయలేదన్నాడు.

ఈ సందర్భంగా కొన్ని విషయాలు బయటపెట్టాడు నాని సినిమాలో హీరోయిన్ మృణాల్ ఫ్యామిలీ ముంబై నుంచి వచ్చిన కుటుంబంలా కనిపిస్తుందట. కాబట్టి ఆ పాత్రలకు ఎవరు సరిపోతారో వాళ్ళనే తీసుకున్నామని, అలాగే చిన్నారి కియారాను కూడా ఒక ఆడిషన్ వీడియో చూసి తీసుకున్నామని స్పష్టం చేశాడు.

హాయ్ నాన్న సినిమా కచ్చితంగా ప్రతి మనసుని టచ్ చేస్తుందంటున్నాడు నాని. పరభాషా నటీనటులు ఉన్నప్పటికీ... ఇదొక అచ్చమైన తెలుగు సినిమా అంటున్నాడు. క్రిస్మస్ కానుకగా రావాల్సిన ఈ సినిమాను 2 వారాల ముందుగా, అంటే డిసెంబర్ 7నే థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

First Published:  16 Oct 2023 2:52 AM GMT
Next Story