Telugu Global
Cinema & Entertainment

HIT 2: తన నమ్మకం నిజమైందంటున్న నాని

HIT 2 Movie : హిట్-2 సినిమాతో తన నమ్మకం నిజమైందంటున్నాడు నాని. ఇంతకీ నాని నమ్మకం ఏంటి? హిట్-2తో అది ఎలా నిజమైంది?

HIT 2: తన నమ్మకం నిజమైందంటున్న నాని
X

హిట్-2 సినిమా పెద్ద హిట్టయిన సందర్భంగా నిర్మాత నాని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సినిమా సక్సెస్ సంబరాల్లో పాల్గొన్న నాని, వాల్ పోస్టర్ సినిమా పెట్టి న్యూ ఏజ్ సినిమాలు తీయాలనే తన నమ్మకం హిట్-2తో నిజమైందన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..

"నేను మేజిక్‌ని నమ్ముతాను. కానీ శేష్‌ మాత్రం లాజిక్‌ను నమ్ముతాడు. అందుకే ఇలా కంటిన్యూగా సక్సెస్‌లు కొడుతున్నాడు. వీరంతా చేసిన పనికి నాకు కూడా కంగ్రాట్స్ వస్తున్నాయి. వాల్ పోస్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు కొత్త చిత్రాలు చేయాలని అనుకున్నాను. కానీ ఆడియెన్స్ అంగీకరిస్తారా అని అందరూ అన్నారు. కానీ మంచి చిత్రాలు తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారని మరోసారి నిరూపించింది హిట్-2 సినిమా. నా నమ్మకం నిజమైంది."

ఇలా హిట్-2 సక్సెస్ పై ఆనందం వ్యక్తం చేశాడు నాని. ఈ సినిమా మూడో భాగం హిట్-3లో స్వయంగా నాని నటించబోతున్నాడు. ఈ విషయాన్ని హిట్-2 క్లైమాక్స్ లో వెల్లడించారు. పోలీసాఫీసర్ అర్జున్ సర్కార్ పాత్రలో నాని కనిపించబోతున్నాడు.

దీనికి సంబంధించి దర్శకుడు శైలేష్ కొలను ఇప్పటికే కొన్ని లీకులు వదులుతున్నాడు. హిట్-1లో నటించిన విశ్వక్ సేన్, హిట్-2లో నటించిన అడివి శేష్ హిట్-3లో నానితో పాటు కలిసి నటించే ఛాన్స్ ఉందంటూ పరోక్షంగా వెల్లడించాడు. అదే కనుక జరిగితే హిట్ ఫ్రాంచైజీలో అతిపెద్ద సినిమా అవుతుంది హిట్-3.

First Published:  6 Dec 2022 3:36 AM GMT
Next Story