Telugu Global
Cinema & Entertainment

Actor Nani | 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని

Actor Nani - హీరోగా 15 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నాడు నాని. అతడు నటించిన తొలి సినిమా అష్టా చమ్మా.

Actor Nani | 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని
X

ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగారు నాని. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ స్థాయి నుంచి నేచురల్‌ స్టార్‌గా ఎదిగి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకొని, ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు. అందుకే నాని అంటే చాలామందికి ఇష్టం.

ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా 15 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు నాని. అతడు హీరోగా పరిచయమైన 'అష్టా చమ్మా' సినిమా 15 ఏళ్ళు పూర్తి చేసుకుంది. తన అద్భుతమైన నటనతో తొలి సినిమాతో ప్రేక్షకుల మనసులో ముద్రవేసుకున్నాడు నాని. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది.

తొలి సినిమాలోనే అందర్నీ ఎట్రాక్ట్ చేశాడు ఈ హీరో. అతడి లుక్స్, మేనరిజమ్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత మినిమం గ్యాప్స్ లో హిట్స్ ఇచ్చుకుంటూ, ఏకంగా నేచురల్ స్టార్ గా ఎదిగాడు. జెర్సీ సినిమా అతడి కెరీర్ బెస్ట్ మూవీ. ఇక తాజాగా వచ్చిన దసరా సినిమా కూడా నాని నటనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.

15 ఏళ్ల సినిమా ప్రయాణంలో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన విజయాలతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తున్నారు నాని. 'దసరా'తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. ప్రస్తుతం మరో పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'హాయ్ నాన్న' చేస్తున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది.

15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అష్టా-చమ్మా సినిమా యూనిట్ మరోసారి కలిసింది. హీరోలు నాని, అవసరాల శ్రీనివాస, హీరోయిన్ స్వాతి, దర్శకుడు ఇంద్రగంటి గెట్-టుగెదర్ అయ్యారు. స్వాతి అయితే అప్పటికీ ఇప్పటికీ ఒకేలా ఉంది.

First Published:  6 Sep 2023 8:44 AM GMT
Next Story