Telugu Global
Cinema & Entertainment

Dasara | వంద రోజుల పండగ చేసిన నాని

Dasara 100 Days - నాని కెరీర్ లో విలక్షణ చిత్రం దసరా. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా 100 రోజులు పూర్తి చేసుకుంది.

Dasara | వంద రోజుల పండగ చేసిన నాని
X

నేచురల్ స్టార్ నాని నటించిన మాస్ ఎంటర్ టైనర్ దసరా. మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఈ సినిమా. నాని కెరీర్ లో పూర్తిస్థాయిలో రిలీజైన పాన్ ఇండియా సినిమాగా ఇది గుర్తింపు తెచ్చుకుంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఉత్తరాదిన ఫెయిల్ అయింది.

ఏపీ,నైజాంలో మాత్రం ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. మరీ ముఖ్యంగా నైజాంలో మాత్రమే ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. మొత్తమ్మీద ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకుంది. నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది.

ఈ సందర్భంగా దసరా సినిమా వంద రోజుల ఫంక్షన్ చేశారు మేకర్స్. డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. హీరో నాని స్వయంగా ఈ వేడుకలో పాల్గొన్నాడు. ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిర్మాతలు అనిల్ సుంకర, నాగవంశీ, సాహు గారపాటి, గోపి అచంట పాల్గొన్నారు.

శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు. సినిమాలో 2 పాటలు పెద్ద హిట్టయ్యాయి.

దీక్షిత్ శెట్టి, సముద్రఖని, షైన్ టామ్ చాకో, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా, నాని కెరీర్ లోనే విలక్షణ చిత్రంగా గుర్తింపు తెచ్చుకుంది.

First Published:  8 Aug 2023 3:34 PM GMT
Next Story