Telugu Global
Cinema & Entertainment

HIT3: హిట్-3 సినిమాలో హీరోగా నాని

Nani HIT 3 Movie: హిట్ 2 సినిమా ఈరోజు రిలీజైంది. ఇది ఎంత థ్రిల్ అందించిందనే విషయం పక్కనపెడితే, పార్ట్-3లో నాని హీరో అనే విషయాన్ని ప్రకటించి చాలా పెద్ద థ్రిల్ అందించారు.

HIT3: హిట్-3 సినిమాలో హీరోగా నాని
X

ఈరోజు థియేటర్లలోకి వచ్చింది హిట్2 సినిమా. మొదటి ఆటకే హిట్ టాక్ సైతం తెచ్చుకుంది. ఈ సంగతి పక్కనపెడితే, ఈ సినిమాతో హిట్-3పై క్లారిటీ ఇచ్చింది యూనిట్. హిట్-3లో నాని హీరోగా నటించబోతున్నాడు. ఆ విషయాన్ని హిట్-2 క్లయిమాక్స్ లో వెల్లడించారు.

హిట్-2 సినిమా క్లయిమాక్స్ లో నాని వస్తాడు. నూతన దంపతులు అడివిశేష్-మీనాక్షిని అభినందిస్తాడు. ఆ తర్వాత ఓ గది వైపు క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒకడ్ని కట్టిపడేసి ఉంచుతారు. పక్కనే ఖాకీ చొక్కా చూపించారు. దీంతో హిట్-3లో నాని పోలీస్ గా కనిపించబోతున్నాడనే విషయంపై స్పష్టత వచ్చింది.

అర్జున్ సర్కార్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటించనున్నాడు నాని. హిట్2 ఎండింగ్ లో నాని క్యారెక్టర్ ఎలా ఉండనుంది? అతని మైండ్ సెట్ ఏంటి? లాంటి డీటెయిల్స్ వాయిస్ ద్వారా చెప్తూ హిట్3 పై భారీ అంచనాలు పెంచేశాడు దర్శకుడు శైలేష్ కొలను.

వందమంది అమాయకులు చనిపోయినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోకూడదనుకునే మైండ్ సెట్ ఉన్న ఆఫీసర్ అంటూ, నాని గురించి టీం మెంబర్ శేష్ కి చెప్పే సీన్ హిట్ ఫ్రాంచైజ్ పై భారీ అంచనాల్ని పెంచేసింది.

First Published:  2 Dec 2022 2:52 PM GMT
Next Story