Telugu Global
Cinema & Entertainment

Nani | మరో సినిమా ప్రకటించిన నాని

Nani - హాయ్ నాన్న సినిమాను పూర్తిచేసిన నాని, మరో సినిమా ఎనౌన్స్ చేశాడు. వివేక్ ఆత్రేయకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు.

Nani | మరో సినిమా ప్రకటించిన నాని
X

'అంటే సుందరానికీ' లాంటి కల్ట్ ఎంటర్‌టైనర్‌ని అందించిన నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి కలిశారు. కొత్త సినిమా ప్రకటించారు. కెరీర్ లో నానీకి ఇది 31వ చిత్రం. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలో నానికి జోడిగా ప్రియాంక మోహన్‌ ను హీరోయిన్ గా తీసుకున్నారు.

ఈసారి డిఫరెంట్ జోనర్ ని ట్రై చేస్తున్నారు నాని-ఆత్రేయ. దీనికి సంబంధించి చిన్న వీడియోను కూడా విడుదల చేశారు. ఈ వీడియో ఆసక్తికరంగా ఉంది. నాని కళ్లలో ఇంటెన్స్ కనిపించింది. చూస్తుంటే, నాని ఓ సరికొత్త గెటప్ లో కనిపించబోతున్నట్టుంది.

ఈసారి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ప్రకటించారు మేకర్స్. అయితే థ్రిల్ తో పాటు ఫన్ కూడా ఉంటుందని స్పష్టం చేశారు. సినిమాను 24వ తేదీన గ్రాండ్ గా లాంచ్ చేయనున్నారు. ఈ సినిమాకు స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పనిచేయబోతోంది. ఆ వివరాల్ని త్వరలోనే వెల్లడిస్తారు.

ప్రస్తుతం హాయ్ నాన్న సినిమా చేస్తున్నాడు నాని. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది. ఈ మూవీ కొలిక్కి వచ్చిన వెంటనే వివేక్ ఆత్రేయ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం తమిళ నటుడు ఎస్ జే సూర్యను తీసుకున్నారు.

First Published:  22 Oct 2023 12:26 PM GMT
Next Story