Telugu Global
Cinema & Entertainment

Hi Nanna | మ్యూజికల్ నైట్ లో నాని డాన్స్

Hi Nanna - హాయ్ నాన్న సినిమా కోసం ఎగ్రెసివ్ గా ప్రచారం చేస్తున్నాడు నాని. తాజాగా మ్యూజికల్ నైట్ నిర్వహించారు. అందులో డాన్స్ కూడా చేశాడు.

Hi Nanna | మ్యూజికల్ నైట్ లో నాని డాన్స్
X

నేచురల్ స్టార్ నాని నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో, మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌. శ్రుతి హాసన్, బేబి కియరా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

‘హాయ్ నాన్న’ ఆడియో ఇప్పటికే సెన్సేషనల్ చార్ట్ బస్టర్ హిట్ అయింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా మ్యూజికల్ నైట్ ఈవెంట్ నిర్వహించింది. భారీ ఎత్తున అభిమానులు, ప్రేక్షకులు పాల్గొన్న ఈ వేడుక కన్నుల పండగగా జరిగింది. మ్యూజికల్ నైట్ ఈవెంట్ లో హీరో నాని 'కమ్మని ఈ ప్రేమలేఖనే'' పాటను పాడి అభిమానులని అలరించాడు.

నాని, మృణాల్ ఠాకూర్ కలసి హాయ్ నాన్న చిత్రంలోని ఓడియమ్మా పాటకు డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి టాప్ ట్రెండింగ్ లో ఉన్నాయి.

ఇక తాజాగా ‘హాయ్ నాన్న’ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చింది. కుటుంబ సమేతంగా ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ‘హాయ్ నాన్న’ అని సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్ ని అభినందించింది. హేషమ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

First Published:  3 Dec 2023 3:54 PM GMT
Next Story