Telugu Global
Cinema & Entertainment

Meet Cute: మీట్ క్యూట్ లో ఎందుకు నటించలేదో చెప్పిన నాని

Nani about Meet Cute - నాని సోదరి దీప్తి తీసిన సినిమా మీట్ క్యూట్. ఇందులో నటించలేకపోయినందుకు బాధ వ్యక్తం చేశాడు నాని.

Meet Cute: మీట్ క్యూట్ లో ఎందుకు నటించలేదో చెప్పిన నాని
X

నిర్మాతగా నాని తీసిన లేటెస్ట్ వెంచర్ మీట్-క్యూట్. నాని సోదరి దీప్తి ఈ సినిమాకు దర్శకురాలు కావడంతో, ఈ హీరోకు ఇది మరింత ప్రతిష్టాత్మకంగా మారింది. అంతేకాదు, సిస్టర్ డైరక్టర్ కాబట్టి నాని ఇందులో కచ్చితంగా ఏదో ఒక పాత్రలో కనిపిస్తాడని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని స్పష్టం చేశాడు నాని.

"నాకు ఇందులో నటించే క్యారెక్టర్ లేదు. సిస్టర్ డైరెక్టర్ కాబట్టి నేను కచ్చితంగా అతిథి పాత్రలో నటిస్తానని అంతా ఎక్స్ పెక్ట్ చేస్తారు. కానీ కథలో అవకాశం లేకుండా నటిస్తే పేరుకు కనిపించినట్లు ఉంటుంది. అందుకే నేను ఇందులో నటించలేకపోయాను."

ఇలా మీట్-క్యూట్ లో నటించలేకపోయానని చెప్పుకొచ్చాడు నాని. నిజానికి తన బ్యానర్ పై తెరకెక్కే సినిమాల్లో తను కనిపించనని, నాని గతంలోనే ప్రకటించాడు. ఇన్నాళ్లూ అదే ఫాలో అవుతూ వచ్చాడు. ఇప్పుడు మీట్-క్యూట్ విషయంలో కూడా అదే జరిగింది.

మీట్ క్యూట్ అనేది ఓ ఆంధాలజీ మూవీ. 6 కథల సమాహారం ఇది. రుహానీ శర్మ, అదా శర్మ, సత్యరాజ్ లాంటి ఆర్టిస్టులు ఇందులో నటించారు. త్వరలోనే సోనీ లివ్ లో ఇది స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రచారం కోసం మీడియా ముందుకొచ్చాడు నాని.

First Published:  21 Nov 2022 2:59 PM GMT
Next Story