Telugu Global
Cinema & Entertainment

Nani | టన్నుల కొద్దీ ప్రేమ ఇస్తానంటున్న నాని

Nani Hi Nanna - హాయ్ నాన్న సినిమాలో టన్నుల కొద్దీ ప్రేమ ఉందంటున్నాడు నాని. ఈ సినిమా సాంగ్ లాంచ్ కోసం కాలేజీ స్టూడెంట్స్ ను కలిశాడు.

Nani | టన్నుల కొద్దీ ప్రేమ ఇస్తానంటున్న నాని
X

నేచురల్ స్టార్ నాని సినిమాల్లో సాధారణంగా మంచి పాటలుంటాయి. అదే విధంగా, శౌర్యువ్ దర్శకత్వం వహించిన నాని పాన్ ఇండియా చిత్రం ‘హాయ్ నాన్నా’ సినిమాలో కూడా మంచి పాటలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలోని మొదటి 2 పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా బిట్స్ ఫిలాని క్యాంపస్ లో జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో ఈ సినిమా మూడో సింగిల్ ‘అమ్మాడి’ పాటని లాంచ్ చేశారు.

సాంగ్ లాంచ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ మృణాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా నాని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హాయ్ నాన్న సినిమాలో కావాల్సినంత ప్రేమ దొరుకుతుందంటున్నాడు.

"బిట్స్ ఫిలాని క్యాంపస్ ఆడిటోరియం నాకు చాలా స్పెషల్. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సమయంలో ఇక్కడికి వచ్చాను. వరుసగా 8 సూపర్ హిట్లు కొట్టాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఈసారి 16 సూపర్ హిట్లు కొట్టకుండా బ్రేక్ తీసుకుంటే కరెక్ట్ కాదని ఫిక్స్ అయిపోయా. ఇక్కడ నుంచి మా ప్రచారం స్టార్ట్ కావడం చాలా ఆనందంగా ఉంది. హాయ్ నాన్నలో మీకు కావాల్సినంత ప్రేమ దొరుకుతుంది. థియేటర్ కి వెళ్లి మంచి ప్రేమకథ చూసి చాలా రోజులైయింది. ఇందులో మీకు టన్నులకొద్ది ప్రేమ దొరుకుతుంది."

డిసెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది హాయ్ నాన్న సినిమా. ఖుషి సినిమాకు మంచి పాటలిచ్చిన హేషమ్, ఈ సినిమాకు సంగీతం అందించాడు. శౌర్యువ్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు.

First Published:  5 Nov 2023 1:53 PM GMT
Next Story