Telugu Global
Cinema & Entertainment

Nandini Reddy - ఈ సినిమాపైనే నా కెరీర్ ఆధారపడింది

Nandini reddy - అన్నీ మంచి శకునములే. రేపు రిలీజ్ కానున్న ఈ సినిమాపైనే తన ఆశలన్నీ ఉన్నాయని చెబుతున్నారు నందినీ రెడ్డి.

Nandini Reddy - ఈ సినిమాపైనే నా కెరీర్ ఆధారపడింది
X

ప్రతి దర్శకుడికి ఓ టైమ్ ఉంటుంది. ఆ టైమ్ లో నిరూపించుకోవాలి, లేదంటే ఆ తర్వాత చేతిలో మంచి కథ ఉన్నప్పటికీ ఉపయోగం ఉండదు. ప్రస్తుతం నందినీ రెడ్డి అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. అన్నీ మంచి శకునములే సినిమాను తీశారు ఈ డైరక్టర్. తన కెరీర్ ఈ సినిమాపైనే ఆధారపడి ఉందని చెబుతున్నారు.

"ఇప్పటివరకు చేసిన సినిమాల్లో బెస్ట్‌ క్లయిమాక్స్‌ ఈ సినిమాకు రాశాను అనుకుంటున్నా. చివరి 20 నిమిషాలపై నా కెరీర్‌ ఆధారపడి ఉంది. ది బెస్ట్‌ అని చెప్పగలను. ఇప్పటికే 30మందికి పైగా బయటివారు, ఇక సెన్సార్‌ అధికారులు చూశాక ది బెస్ట్‌ అన్నారు. ఈ సినిమా నా కెరీర్ ను డిసైడ్ చేస్తుంది, అందులో నో డౌట్."

ఇలా అన్నీ మంచి శకునములే సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు నందినీ రెడ్డి. సాధారణంగా స్టోరీ, స్క్రీన్ ప్లే మొత్తం తనే రాసుకుంటానని.. అందుకే కెరీర్ లో సినిమా-సినిమాకి మధ్య చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పారు నందినీ రెడ్డి. ఇకపై అలాంటి గ్యాప్ రాకుండా కొంతమంది రైటర్స్ ను తీసుకున్నట్టు ఆమె స్పష్టం చేశారు.

ఈ సినిమా తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఓ సినిమా చేయబోతున్నారు నందినీ రెడ్డి. ఆ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది.

First Published:  17 May 2023 1:23 PM GMT
Next Story