Telugu Global
Cinema & Entertainment

Mahesh Babu: కొత్త సినిమా కోసం జిమ్ లో మహేష్

Mahesh babu Gym workout: కొత్త సినిమా కోసం మహేష్ బాబు కసరత్తులు మొదలుపెట్టాడు. త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో కొత్త షెడ్యూల్ స్టార్ట్ చేస్తాడు ఈ హీరో.

Mahesh Babu: కొత్త సినిమా కోసం జిమ్ లో మహేష్
X

తల్లిని కోల్పోయిన తర్వాత సినిమాలకు విరామం ఇచ్చాడు మహేష్ బాబు. బాధ నుంచి కోలుకునేందుకు విదేశాలకు కూడా వెళ్లాడు. ఇప్పుడు హైదరాబాద్ తిరిగొచ్చాడు. తల్లి లేని బాధ నుంచి త్వరగానే కోలుకున్న మహేష్, ఇప్పుడు కొత్త సినిమా కోసం సన్నద్ధం అవుతున్నాడు. ఇందులో భాగంగా జిమ్ లో వర్కవుట్స్ మొదలుపెట్టాడు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపు పుష్కర కాలం తర్వాత వీళ్లిద్దరూ కలిసి వర్క్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ ను కొత్తగా చూపించబోతున్నాడు దీనికి సంబంధించి మేకోవర్ కూడా పూర్తయింది. ప్రస్తుతం ఆ లుక్ కోసమే మహేష్ జిమ్ లో కష్టపడుతున్నాడు.

తన ఫిజిక్ పై మహేష్ ఎంత ప్రత్యేక శ్రద్ధ పెడతాడో అందరికీ తెలిసిందే. రెగ్యులర్ గా వ్యాయమం చేస్తాడు, మితాహారం తింటాడు. పాల ఉత్పత్తుల జోలికి అస్సలు వెళ్లడు. అందుకే ఇన్నాళ్లయినా ఇంకా యంగ్ గా కనిపిస్తున్నాడు. త్రివిక్రమ్ సినిమాలో అతడు మరింత ఎట్రాక్టివ్ గా కనిపించబోతున్నాడు

హారిక-హాసిని బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన మరోసారి మెరవనుంది పూజా హెగ్డే. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తారు.

First Published:  10 Nov 2022 5:30 AM GMT
Next Story