Telugu Global
Cinema & Entertainment

Rangabali - రంగబలి టీజర్ ఎలా ఉందంటే..?

Rangabali Movie Teaser - నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా టీజర్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..

Rangabali - రంగబలి టీజర్ ఎలా ఉందంటే..?
X

నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం ‘రంగబలి’. ఈ చిత్రం ద్వారా పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌ఎల్‌వి సినిమాస్‌ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. యుక్తి తరేజా హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతోంది. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

రంగబలి అనే టైటిల్ చూసి చాలామంది ఇది కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనుకున్నారు. కానీ మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన ట్రయిలర్ చూస్తే, ఇందులో కామెడీనే ఎక్కువగా ఉందనే విషయం అర్థమైంది.

దూకుడు స్వభావం, లోకల్ ఫీలింగ్ ఉన్న హీరో చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతుంటాడు. అందరూ అతడ్ని తిడుతుంటే, హీరోయిన్ మాత్రం తను చాలా సాఫ్ట్ అనుకుంటుంది. హీరో తండ్రికి మెడికల్ షాప్ ఉంటుంది. కానీ హీరోకి మెడిసిన్ కి సంబధించిన బేసిక్స్ కూడా తెలియవు. హీరోయిన్ మాత్రం డాక్టర్. ఇలా అంతా ఫన్నీ సెటప్ కనిపిస్తోంది.

నాగశౌర్య ఈ పాత్రను చాలా ఈజ్ తో చేసినట్టు టీజర్ చూస్తే అర్థమౌతుంది. గోదావరి యాసలో డైలాగులు చెప్పి అలరించాడు. యుక్తి తరేజా కూల్‌ గా కనిపించగా.. సత్య, సప్తగిరి, ఇతర హాస్యనటుల తగినంత వినోదాన్ని పంచారు. దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో పాత్రను కూడా ఇందులో పరిచయం చేశారు.

లవ్ స్టోరీ ఫేమ్ పవన్ సిహెచ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వస్తోంది రంగబలి.



First Published:  9 Jun 2023 10:04 AM GMT
Next Story