Telugu Global
Cinema & Entertainment

Rangabali - నాగశౌర్య సినిమాకు విడుదల తేదీ ఫిక్స్

Nagashaurya's Rangabali movie - నాగశౌర్య కొత్త సినిమా పేరు రంగబలి. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Rangabali - నాగశౌర్య సినిమాకు విడుదల తేదీ ఫిక్స్
X

హీరో నాగశౌర్య రంగబలి అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పవన్ బాసంశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఉగాది నాడు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, పల్లెటూరి నేపథ్యం లో సాగే కథతో రంగబలి వస్తోందనే విషయాన్ని ఆల్రెడీ వెల్లడించారు. ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ కు చెందిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రంగబలికి రిలీజ్ డేట్ లాక్ చేశారు. జూలై 7న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. నాగశౌర్య ట్రెండీ గెటప్‌ లో కనిపిస్తున్న పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు. దీనికోసం అతడు మేకోవర్ కూడా అయ్యాడు. ఫిదా ఫేమ్ పవన్ సీహెచ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నడుస్తోంది. ఫైనల్ షెడ్యూల్ లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వచ్చేనెల నుంచి ప్రచారం మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు.

First Published:  12 May 2023 1:05 PM GMT
Next Story