Telugu Global
Cinema & Entertainment

NagaShaurya: ఎట్టకేలకు ఫస్ట్ లుక్ రిలీజ్

NagaShaurya: నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది.

Phalana Abbayi Phalana Ammayi  Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ రివ్యూ
X

Phalana Abbayi Phalana Ammayi Review: ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి మూవీ రివ్యూ

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఫిల్మ్ 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. శ్రీనివాస్ అవసరాల దర్శకత్వం వహిస్తున్నాడు. 'కళ్యాణ వైభోగమే' చిత్రంతో వెండితెరపై మ్యాజిక్‌ చేసిన హిట్ పెయిర్ నాగశౌర్య, మాళవిక నాయర్ ఈ చిత్రంలో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

నాగశౌర్య, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల కలిసి గతంలో 'ఊహలు గుసగుసలాడే', 'జ్యో అచ్యుతానంద' అనే రెండు మంచి చిత్రాలను అందించారు. ఇప్పుడు 'ఫలానా అబ్బాయి ఫలానా అబ్బాయి'తో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల హ్యాట్రిక్ అందుకోవడానికి సిద్ధమవుతున్నారు.

చాన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా వల్ల మరింత లేట్ అయింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగశౌర్య, మాళవిక నాయర్ ఇద్దరూ ఫార్మల్ వింటర్‌వేర్ ధరించి, ప్రయాణంలో ఒకరిపై ఒకరు వాలిపోయి సంగీతం వింటూ కనిపించారు.

'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' అనేది ఒక దశాబ్దం పాటు ఓ జంట మధ్య సాగే ప్రేమ ప్రయాణం. ఈ చిత్రం 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వయస్సు వరకు సాగే వారి ప్రయాణంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. ఇందులో ప్రేమ సన్నివేశాలు చాలా సహజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయంట. శ్రీనివాస్ అవసరాల సంభాషణలు ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.

గతంలో నాగశౌర్య-శ్రీనివాస్ అవసరాల కలయికలో వచ్చిన రెండు చిత్రాలకు అద్భుతమైన సంగీతం అందించిన కళ్యాణి మాలిక్, 'ఫలానా అబ్బాయి ఫలనా అమ్మాయి'కి సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. విడుదల తేదీతో పాటు సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

First Published:  3 Jan 2023 7:30 AM GMT
Next Story