Telugu Global
Cinema & Entertainment

మరో కొత్త దర్శకుడితో నాగశౌర్య

మరో దర్శకుడ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడు నాగశౌర్య. అతడి పేరు పవన్ బాసంరెడ్డి. ఈ రోజు ఈ సినిమా లాంఛనంగా మొదలైంది.

మరో కొత్త దర్శకుడితో నాగశౌర్య
X

కొత్త దర్శకుల్ని పరిచయం చేయడం నాగశౌర్యకు కొత్తేంకాదు. ఇప్పటికే చాలామందిని పరిచయం చేశాడు. ఇప్పుడు మరో కుర్రాడ్ని దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో నాగశౌర్య హీరోగా, నూతన దర్శకుడు పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో ఈరోజు కొత్త సినిమా మొదలైంది.

ముహూర్తం షాట్‌కు లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్రరావు క్లాప్‌బోర్డ్‌ కొట్టి స్క్రిప్ట్‌ను అందజేశారు. నాని హీరోగా నటిస్తున్న 'దసరా' దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కెమెరా స్విచాన్ చేశాడు.

ఈ సినిమాకు ఇంకా పేరు పెట్టలేదు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌లో నాగశౌర్యకు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని ఈ కథ తయారుచేశారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

ఈ చిత్రంలో నాగశౌర్యకు జోడీగా యుక్తి తరేజా నటిస్తోంది. నాగచైతన్య లవ్ స్టోరీకి అద్భుతమైన ఆల్బమ్ అందించిన ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సీహెచ్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూట్ మొదలుపెడతారు.

First Published:  22 Aug 2022 12:53 PM GMT
Next Story