Telugu Global
Cinema & Entertainment

Nagashaurya: నాగశౌర్య సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం

తన కెరీర్ లో 24వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు నాగశౌర్య. ఈ సినిమాకు హరిస్ జైరాజ్ సంగీతం అందిస్తుండడం విశేషం.

Nagashaurya: నాగశౌర్య సినిమాకు హారిస్ జైరాజ్ సంగీతం
X

నాగశౌర్య 24వ చిత్రం మొదలైంది. నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై శ్రీనివాసరావు చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైంది ఈ సినిమా. దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌ కు క్లాప్‌ కొట్టారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్ కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు.

నాగశౌర్య కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. యూత్, ఫ్యామిలీస్‌ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా ఇది రాబోతోంది. హీరోయిన్ ఎవరనేది ఇంకా తేల్చలేదు. ఇందులో నాగశౌర్య డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. హారిస్ జయరాజ్ కు తెలుగులో కల్ట్ అభిమానులున్నారు. అతడి మ్యూజిక్ అంటే చాలామందికి ఇష్టం. నాగశౌర్య సినిమాతో హారిస్ మరోసారి తన మేజిక్ రిపీట్ చేస్తాడని అంతా భావిస్తున్నారు.

First Published:  7 Nov 2022 3:59 AM GMT
Next Story