Telugu Global
Cinema & Entertainment

Nagashaurya: కొత్త సినిమా ప్రకటించిన శౌర్య

తన కెరీర్ లో 24వ చిత్రాన్ని ప్రకటించాడు నాగశౌర్య. ఓ కొత్త దర్శకుడ్ని, ఓ కొత్త బ్యానర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. ఇదొక ఫ్యామిలీ, యాక్షన్ మూవీ.

Nagashaurya: కొత్త సినిమా ప్రకటించిన శౌర్య
X

కెరీర్ లో 24వ చిత్రాన్ని ప్రకటించాడు నాగశౌర్య. ఈ సినిమాకు అరుణాచలం దర్శకత్వం వహించనున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమా, శౌర్య ఇమేజ్ కు సరిగ్గా సరిపోతుందట.

వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు.

దర్శకుడు ఎస్‌ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నాడు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు. ఓపెనింగ్ రోజున హీరోయిన్ ఎవరనే విషయాన్ని ప్రకటిస్తారు.

ఈ సినిమాతో తన కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకుంటున్నాడట నాగశౌర్య. ప్రస్తుతం ఈ హీరో ఒక్కో సినిమాకు కోటి 75 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. అంతకుమించి ఈ సినిమాకు అతడు ఛార్డ్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

First Published:  4 Nov 2022 5:30 AM GMT
Next Story