Telugu Global
Cinema & Entertainment

ఆగస్టు 25న ది ఘోస్ట్ ట్రైలర్.. వైరల్‌గా మారిన ప్రోమో..!

నాగార్జున- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో మొట్టమొదటగా వస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.

ఆగస్టు 25న ది ఘోస్ట్ ట్రైలర్.. వైరల్‌గా మారిన ప్రోమో..!
X

కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా పక్కా యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. నాగార్జున చాలా గ్యాప్ తర్వాత ఓ మాంచి యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రోమోలు, పోస్టర్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి మరో ప్రోమో విడుదలైంది. 'తమ హగనే' పేరుతో విడుదలైన ఈ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

ఈ వీడియోలో నాగార్జున లోహంతో ఒక పొడవాటి కత్తిని సొంతంగా తయారు చేసుకోవడం చూపించారు. ఆ తర్వాత అక్కడికి భారీగా పోలీసులు చేరుకోవడం.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియకుండా సస్పెన్స్ ఉంచుతూ రక్తపు మరకలతో నిండిన కత్తిని నాగార్జున తిరిగి ఒరలోకి పెట్టుకోవడం చూపించారు. ఈ ప్రోమో చూస్తుంటే నాగార్జున ఇంతకుముందెప్పుడూ ఇటువంటి పాత్ర పోషించలేదనిపిస్తోంది.

ప్రోమోలో భరత్, సౌరభ్‌లు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది. అలాగే ప్రోమో లో ఈ సినిమా ట్రైలర్ ఆగస్టు 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించారు. అక్టోబర్ 5వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నాగార్జున- ప్రవీణ్ సత్తార్ కాంబినేషన్‌లో మొట్టమొదటగా వస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

First Published:  18 Aug 2022 12:40 PM GMT
Next Story