Telugu Global
Cinema & Entertainment

'ఘోస్ట్' కు పుట్టినరోజు శుభాకాంక్షలు

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ది ఘోస్ట్ యూనిట్ అతడికి పుట్టినరోజు శుభాంకాక్షలు తెలిపింది. ఈ సందర్భంగా విడుదల చేసిన కొన్ని స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

ఘోస్ట్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు
X

అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ది ఘోస్ట్' తమహగనే తో పాటు థియేట్రికల్ ట్రైలర్‌ కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి భారీ స్పందన వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ 9 మిలియన్ల వ్యూస్, 2 లక్షలకు పైగా లైక్స్ తో ఇప్పటికీ యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో ఉంది.

ఈరోజు కింగ్ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో తమహగనే చేతిలో పట్టుకుని కుర్చీలో కూర్చుని ఇంటెన్స్ లుక్ లో కనిపించారు నాగార్జున. సరికొత్త కాన్సెప్ట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం నుండి విడుదల చేసిన ఈ పోస్టర్ పెర్ ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ అనిపించుకుంది.

ఈ చిత్రంలో తమహగనే అనేది నాగార్జున ఆయుధం. తమహగనే గ్లింప్స్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగార్జున, సోనాల్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్లుగా కనిపించనున్న ఈ సినిమాలో.. గుల్ పనాగ్ , అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ది ఘోస్ట్ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి వస్తున్నాడు ఘోస్ట్.








First Published:  29 Aug 2022 10:50 AM GMT
Next Story