Telugu Global
Cinema & Entertainment

Naa Saami Ranga | నా సామిరంగ షూటింగ్ అప్ డేట్స్

Naa Saami Ranga - సంక్రాంతికి సిద్ధమౌతోంది నా సామిరంగ. ప్రస్తుతం ఈ సినిమా షూట్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం.

Naa Saami Ranga | నా సామిరంగ షూటింగ్ అప్ డేట్స్
X

కింగ్ నాగార్జున మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నా సామిరంగ’ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రానికి విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం స్టూడియోలో వేసిన భారీ సెట్‌లో నా సామిరంగ టైటిల్ సాంగ్‌ని చిత్రీకరిస్తున్నారు. ఆస్కార్ అవార్డ్ విజేతలు ఎంఎం కీరవాణి, చంద్రబోస్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు.

ఈ మాస్ నంబర్‌లో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా అలరించనున్నారు. సినిమాకే పెద్ద ఆకర్షణగా నిలవనున్న ఈ పాట చిత్రీకరణలో 300 మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారు. దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

టీజర్‌లో నాగార్జునతో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ స్క్రీన్ షేర్ చేసుకోవడం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. టీజర్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. ముగ్గురిపై పాట థియేటర్స్ లో అదిరిపోయేలా ఉంటుంది. నాగార్జున, కీరవాణి, చంద్రబోస్‌ కాంబినేషన్ లో పాటలు పెద్ద హిట్టవుతాయంటున్నారు మేకర్స్.

నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బెజవాడ ప్రసన్నకుమార్ కథ, డైలాగ్స్ అందిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది నా సామిరంగ సినిమా.

First Published:  22 Dec 2023 5:24 PM GMT
Next Story