Telugu Global
Cinema & Entertainment

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్

Nagarjuna's Naa Saami Ranga | నాగార్జున హీరోగా నటిస్తున్న సినిమా నా సామిరంగ. ఈ సినిమా షూటింగ్ దాదాపు 50శాతం పూర్తయింది.

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్

Naa Saami Ranga | నాగార్జునకు కొత్త సెంటిమెంట్ పట్టుకుంది. తను చేసే ప్రతి సినిమాను ఏదో ఒక షెడ్యూల్ ను మైసూర్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. గతంలో ఇలా చేస్తే హిట్స్ వచ్చాయి, దీంతో ఆ సెంటిమెంట్ ను కొత్త సినిమాలో కూడా కొనసాగిస్తున్నాడు కింగ్.

మైసూర్ ప్రాంతంతో నాగార్జునకు బలమైన సెంటిమెంట్ ఉంది. తన సినిమాల కోసం, అతను మైసూర్ సమీపంలోని విలేజ్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఇష్టపడతాడు. మనం, సోగ్గాడే చిన్ని నాయనా, బంగారాజు సినిమాలకు అలాగే చేశాడు. ఆ సినిమాలన్నీ బాగా ఆడాయి. దీంతో తన కొత్త సినిమాకు కూడా మైసూర్ షెడ్యూల్ ప్లాన్ చేశాడు.

విజయ్ బిన్నీ దర్శకత్వంలో నా సామిరంగా అనే సినిమా చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా కొత్త షెడ్యూల్ వచ్చే వారం నుంచి మైసూర్ పరిసర ప్రాంతాల్లో ప్రారంభమౌతుంది. సినిమాకు సంబంధించి కొన్ని విలేజ్ సీన్స్ ను అక్కడ తీయబోతున్నారు.

ఈ చిత్రంలో నాగార్జునకు జోడీగా కన్నడ నటి ఆషికా రంగనాథ్‌ నటిస్తోంది. ఈమె కల్యాణ్ రామ్ తో అమిగోస్ అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగార్జున సరసన నటించే అవకాశం అఁదుకుంది. నా సామిరంగా సినిమాలో మరో ఇద్దరు హీరోలు కూడా నటిస్తున్నారు. సినిమాలో కీలక పాత్రల్లో అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కనిపించబోతున్నారు.

ఈ సంక్రాంతికి థియేటర్లలోకి వస్తోంది నా సామిరంగ సినిమా. ఆ విషయాన్ని ఓ వీడియో విడుదల చేసి గ్రాండ్ గా ప్రకటించబోతున్నాడు నాగార్జున. ఈ హీరో కెరీర్ లో 99వ సినిమా ఇది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  4 Nov 2023 7:01 AM GMT
Next Story