Telugu Global
Cinema & Entertainment

Kubera | సెట్స్ పైకొచ్చి నాగార్జున

Kubera Movie - ధనుష్ హీరోగా నటిస్తున్న సినిమా కుబేర. ఇప్పుడీ మూవీ సెట్స్ పైకి నాగార్జున వచ్చాడు.

Kubera | సెట్స్ పైకొచ్చి నాగార్జున
X

నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'కుబేర'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ మహా శివరాత్రికి విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ధనుష్ డిఫరెంట్ గెటప్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తాజాగా బ్యాంకాక్‌లో కొత్త షూటింగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది టీమ్. నాగార్జునతో పాటు మరికొందరు నటీనటులు పాల్గొంటున్న ఈ షెడ్యూల్‌లో కొన్ని టాకీ, యాక్షన్ పార్ట్‌లు చిత్రీకరించనున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా ఇంతకు ముందు ఎవరూ చూడని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో నాగర్జున, శేఖర్ కమ్ముల సంభాషిస్తూ కనిపించారు. బ్యాక్ గ్రౌండ్ లో వండర్ ఫుల్ వ్యూని గమనించవచ్చు.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్. నేషనల్ అవార్డ్ విన్నర్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చగా, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. స్లమ్ లో బిచ్చగాడిగా ఉన్న ఓ వ్యక్తి, దేశంలోనే కరడుగట్టిన మాఫియా డాన్ గా ఎలా మారాడనే అంశాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారట.

First Published:  13 March 2024 5:05 PM GMT
Next Story