Telugu Global
Cinema & Entertainment

Nagarjuna | సంక్రాంతి బాక్సాఫీస్ ను కొడుతున్నాం

Nagarjuna - నా సామిరంగ.. నాగార్జున నటించిన తాజా చిత్రం. ఈ సినిమాతో మరోసారి సంక్రాంతి హిట్ కొడతానంటున్నాడు నాగ్.

Nagarjuna | సంక్రాంతి బాక్సాఫీస్ ను కొడుతున్నాం
X

గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్ లాంటి సినిమాలు సంక్రాంతి రేసులో ఉన్నప్పటికీ నాగార్జున, ధైర్యంగా తన సినిమాను రిలీజ్ చేస్తున్నాడు. అదే నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. నాగార్జున తన అభిమానులకు నా సామిరంగతో బ్లాక్‌బస్టర్ అందిస్తానని అభిమానులకు మాటిచ్చాడు.

ఈ వేడుకకు నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా, రుక్సార్ ధిల్లాన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కూడా పాల్గొన్నారు. సినిమా విజయంపై నాగార్జున విశ్వాసం వ్యక్తం చేశాడు.

"నా సామిరంగాతో మీ ముందుకు వస్తున్నాం. మంచి సినిమా ఇస్తే ఎలా మెచ్చుకుంటారో 2 పండగలు చూశాను. ఈ పండుగకు కూడా అదే విధంగా మద్దతు లభిస్తుందని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి కీరవాణి అందించిన పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్. 3 నెలల్లో సినిమాను పూర్తి చేశారంటే మా టీమ్‌పై మాకు ఎంత నమ్మకం ఉందో అర్థం చేసుకోవచ్చు."

3 నెలల్లో సినిమా ఎలా తీయాలో పుస్తకం రాస్తానంటూ జోక్ చేసిన నాగార్జున.. ఈ పండక్కి కిష్టయ్య వస్తున్నాడని.. బాక్సాఫీస్ ను కొల్లగొడతాడని నమ్మకంగా చెప్పాడు.

First Published:  11 Jan 2024 4:50 PM GMT
Next Story