Telugu Global
Cinema & Entertainment

ది ఘోస్ట్.. రిలీజ్ ట్రయిలర్ అదిరింది

దసరా బరిలో నిలిచింది ది ఘోస్ట్ మూవీ. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ ట్రయిలర్ వచ్చింది.

ది ఘోస్ట్.. రిలీజ్ ట్రయిలర్ అదిరింది
X

దసరా రేసులో అందరికంటే ముందున్నాడు నాగ్. తన సినిమా ది ఘోస్ట్ ప్రచారాన్ని గట్టిగా చేస్తున్నాడు. సినిమాకి సంబంధించిన డిఫరెంట్ షేడ్స్ చూపించేలా డిఫరెంట్ ప్రోమోలను రిలీజ్ చేస్తున్నారు. అలా సినిమాలోని అన్ని అంశాల సమ్మేళనంగా తాజాగా థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశాడు.

రిలీజ్ ట్రయిలర్ లో కొత్త యాంగిల్ చూపించాడు నాగ్. ఇది ఫ్యామిలీ డ్రామాతో కూడిన యాక్షన్-ప్యాక్డ్ సినిమా అనే విషయం తాజా ట్రయిలర్ తో అర్థమైంది. తమహాగానే కత్తిని చేతిలో పట్టుకుని, శత్రువులు తన ముందు తలదించుతూ, లొంగిపోతుంటగా.. నాగార్జున పాత్రను పరిపూర్ణంగా పరిచయం చేశారు.

నాగార్జున 20 సంవత్సరాల తర్వాత తన సోదరి ఇంటికి వస్తాడు. అండర్ వరల్డ్ తో ముప్పు ఉండడంతో, నాగ్ ఇలా లాంగ్ గ్యాప్ తర్వాత ఇంటికొస్తాడు. తన ప్రయాణంలో డబ్బు, విజయం కంటే శత్రువులనే ఎక్కువగా సంపాదించుకుంటాడు ఘోస్ట్. తన కుటుంబాన్ని ఘోస్ట్ ఎలా రక్షించుకున్నాడనేది ఈ సినిమా స్టోరీ.

అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈ చిత్రాన్ని రూపొందించాడు. నాగార్జున పాత్రలో స్టయిల్ తో పాటు, యాక్షన్ చూపించాడు. నాగార్జున, సోనాల్ చౌహాన్ మధ్య రొమాన్స్ ను కూడా వీడియోలో చూపించారు. సోనాల్ బికినీ ట్రీట్ కూడా సినిమాలో ఉండబోతోంది. దసరా కానుకగా అక్టోబర్ 5న థియేటర్లలోకి వస్తున్నాడు ఘోస్ట్.



First Published:  1 Oct 2022 6:32 AM GMT
Next Story