Telugu Global
Cinema & Entertainment

Nagarjuna - మహేష్ భట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నాగ్

Nagarjuna, Mahesh Bhatt, 1920 movie, criminal movie,

Nagarjuna - మహేష్ భట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నాగ్
X

టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు బాలీవుడ్ తో కూడా కనెక్షన్ ఉంది. చాలామంది బాలీవుడ్ ప్రముఖులు నాగార్జునకు తెలుసు. పైగా హిందీలో ఆయన సినిమాలు చేశాడు. రీసెంట్ గా కూడా బ్రహ్మాస్త్ర సినిమా చేశాడు.

బాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరైన మహేష్ భట్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు నాగార్జున. ఆయన్ను కలిసి దాదాపు 20 ఏళ్లు అయిందని, ఇప్పటికీ తన మనసులో ఉన్నారని అన్నాడు.

"మహేష్ భట్ ని కలిసి దాదాపు 20 ఏళ్ళయింది. కానీ ఆయన నా మనసులో ఎప్పుడూ ఉంటారు. నేను కూడా ఆయన మనసులో ఉంటాననే నమ్ముతున్నాను. ముంబై షూటింగ్స్ కి వెళితే భట్ గారి గురించి అడుగుతుంటాను. బ్రహ్మస్త్ర సినిమాలో అలియా భట్ తో వర్క్ చేశాను. ఆ సమయంలో భట్ గారి గురించి ఎన్నో విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. భట్ గారు నాకు గురు. చాలా స్ఫూర్తిని ఇచ్చే వ్యక్తి. ఎంతో మందికి అవకాశాలు ఇచ్చి దారి చూపించారు. ఆయన పాటలు చేయించుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికీ 'తెలుసా మనసా పాట చేయించిన విధానం గుర్తుకు వస్తుంటుంది. అలాగే 'జకమ్' లో గలీ మే ఆజ్ చాంద్ నిక్లా పాట నా ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తున్నాయి."

ఇలా మహేష్ భట్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు నాగార్జున. అవికా గౌర్ కు చెందిన ఓ సినిమా ట్రయిలర్ ను లాంచ్ చేశాడు నాగార్జున. ఆ సినిమాకు మహేష్ భట్ కథ-స్క్రీన్ ప్లే అందించారు. అలా భట్ తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు నాగ్.

First Published:  15 Jun 2023 5:17 PM GMT
Next Story