Telugu Global
Cinema & Entertainment

Avika Gor: నాగార్జునకు షాక్ ఇచ్చిన చిన్నారి పెళ్లికూతురు

Avika Gor: నాగార్జునకు షాక్ ఇచ్చిందట అవికా గౌర్. ఆ విషయాన్ని స్వయంగా నాగార్జున వెల్లడించాడు.

Avika Gor: నాగార్జునకు షాక్ ఇచ్చిన చిన్నారి పెళ్లికూతురు
X

అవికా గౌర్.. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అమ్మాయి. తర్వాత ఈ పిల్ల తెలుగులో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమాను నాగార్జున నిర్మించాడు. ఆ టైమ్ లో తనే దగ్గరుండి ప్రచారాన్ని కూడా చేశాడు.

ఇప్పుడు మరోసారి అవికా గౌర్ సినిమా ప్రచారానికి ముందుకొచ్చాడు నాగ్. ఆమె తాజా చిత్రం పాప్ కార్న్. ఈ సినిమా ట్రయిలర్ లాంచ్ కు నాగ్ వచ్చాడు. తన చేతుల మీదుగా ట్రయిలర్ విడుదల చేసిన నాగార్జున, అవికా గౌర్ తనకు గతంలో షాకిచ్చిన ఓ విషయాన్ని బయటపెట్టాడు.

ఓసారి నాగార్జున బ్రెజిల్ వెళ్లాడంట. రియో నగరాన్ని సందర్శించాడు. అక్కడున్న అత్యాధునిక ఫిలిం స్టుడియోను పరిశీలించడానికి వెళ్లాడట. ఆ టైమ్ లో రియో నగరంలో ఓ పోస్టర్ చూశాడట. స్థానిక భాషలో అక్కడ ఏదో రాసి ఉందంట. కానీ అందులో అవికా గౌర్ ఫొటో ఉందంట.

ఏంటని అడిగితే, తమ దగ్గర అవికా గౌర్ చాలా ఫేమస్ అని, చిన్నారి పెళ్లికూతుర్ని డబ్బింగ్ చేసి తాము చూస్తున్నామని, ఆ సీరియర్ పెద్ద హిట్టని చెప్పారట.

అలా పదేళ్ల కిందట తనకు ఎదురైన షాకింగ్ ఘటనను బయటపెట్టాడు నాగ్. ఇప్పుడు టాలీవుడ్ నటులంతా పాన్ ఇండియా అప్పీల్ కోసం తహతహలాడుతున్నారని, అవికా గౌర్ పదేళ్ల కిందటే పాన్ వరల్డ్ స్టార్ అయిపోయిందని మెచ్చుకున్నాడు నాగ్.

First Published:  5 Jan 2023 6:30 AM GMT
Next Story