Telugu Global
Cinema & Entertainment

కార్తిని పవన్ తో పోల్చిన నాగార్జున

సినిమాలు, క్రేజ్, రెమ్యూనరేషన్ విషయంలో కార్తి-పవన్ మధ్య పోలిక పెట్టలేం. కానీ ఒక్క విషయంలో మాత్రం ఈ ఇద్దరి మధ్య పోలిక ఉందంటున్నాడు హీరో నాగార్జున.

కార్తిని పవన్ తో పోల్చిన నాగార్జున
X

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు కార్తి. ఇటు పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి, అతడి సినిమాల గురించి అందరికీ తెలిసిందే. మరి ఈ ఇద్దరు హీరోల మధ్య పోలిక ఏంటి? ఎంత ఆలోచించినా తట్టడం లేదా? కార్తిని, పవన్ కల్యాణ్ తో పోల్చాడు సీనియర్ హీరో నాగార్జున.

"కార్తి అన్న సూర్య సూపర్ స్టార్. ఆ సూపర్ స్టార్ నీడ నుండి బయటికి వచ్చి ప్రూవ్ చేసుకోవడం చాలా అరుదు. అలాంటి వాళ్ళని ఇద్దరినే చూశాను. ఇక్కడ మెగాస్టార్ తమ్ముడు పవన్ కళ్యాణ్.. కన్నడలో శివన్న తమ్ముడు పునీత్ రాజ్ కుమార్.. తమిళనాడులో సూర్య తమ్ముడు కార్తి. ఇలా స్టార్ డమ్ సంపాయించడం మామూలు విషయం కాదు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసి సూర్య అంత సూపర్ స్టార్ అయ్యాడు."

ఇలా కార్తికి, పవన్ కల్యాణ్ కు లింక్ పెడుతూ మాట్లాడాడు నాగార్జున. కార్తి నటించిన లేటెస్ట్ మూవీ సర్దార్. ఈ సినిమాను తెలుగులో అన్నపూర్ణ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీపై నాగార్జున రిలీజ్ చేస్తున్నాడు. రేపు ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది.

ఊపిరితో కార్తి తనకు బాగా దగ్గరయ్యాడని, అప్పట్నుంచి తమ అనుబంధం కొనసాగుతోందని ప్రకటించాడు నాగ్. కార్తి నటించిన సర్దార్ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నాడు.

First Published:  20 Oct 2022 4:18 AM GMT
Next Story