Telugu Global
Cinema & Entertainment

Nagarjuna | బర్త్ డే సందర్భంగా కొత్త సినిమా ఎనౌన్స్ చేసిన నాగ్

Nagarjuna Naa SaamiRanga - నా సామిరంగా టైటిల్ తో కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు నాగ్. కొరియోగ్రాఫర్ బిన్నీ విజయ్ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. బెజవాడ ప్రసన్నకుమార్ కథ-డైలాగ్స్ అందిస్తున్నాడు.

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్
X

Naa Saami Ranga | నాగార్జున మూవీ షూటింగ్ అప్ డేట్స్

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. పాపులర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సినిమా ప్రకటించాడు నాగ్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది.

మరో బిగ్ సర్ ప్రైజ్ ఏంటంటే.. మూవీ ప్రకటనతోనే గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. పనిలోపనిగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. అలా ఒకేసారి ప్రాజెక్టు తో పాటు నాగార్జున ఫస్ట్ లుక్, సినిమా టైటిల్ ను ఒకేసారి విడుదల చేసినట్టయింది. ఈ సినిమాకు 'నా సామిరంగా' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక గ్లింప్స్ ఎలా ఉందో చూద్దాం..

నాగార్జున ఫస్ట్ లుక్ పోస్టర్‌లో బీడీ తాగుతూ మాసీ హెయిర్ స్టయిల్, గడ్డంతో మాస్ అవతార్‌ లో కనిపించారు. పలాస ఫేమ్ కరుణ కుమార్, అతని గూండాల బ్యాచ్ హీరోని చంపడానికి చూస్తున్నప్పుడు.. సింబాలిక్‌గా కింగ్‌ అని చూపిస్తారు. ఆ తర్వాత నాగార్జున ఎంట్రీ, ఫైట్ చూపిస్తన్నారు. నాగ్ ఎంట్రీతో మాస్ జాతర మొదలవుతుంది.

నాగార్జునకు గతంలో అనేక చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లను అందించి ఆస్కార్, జాతీయ అవార్డును గెలుచుకున్న లెజెండరీ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గ్లింప్స్ కు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

మేకర్స్ మరో సర్ ప్రైజ్ అప్‌డేట్‌ కూడా ఇచ్చారు. ‘నా సామిరంగ’ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తారు. బంగార్రాజు, సోగ్గాడే చిన్ని నాయనా సినిమాలతో నాగార్జునకు సంక్రాంతి సెంటిమెంట్ గా మారింది.

First Published:  29 Aug 2023 5:33 PM GMT
Next Story