Telugu Global
Cinema & Entertainment

నాగ్, అఖిల్ కాంబోలో సినిమా

నాగార్జున-నాగచైతన్య కలిసి సినిమాలు చేశారు. మరి నాగార్జున, అఖిల్ కలిసి ఎప్పుడు సినిమా చేస్తారు..? దీనిపై నాగ్ క్లారిటీ ఇచ్చాడు.

నాగ్, అఖిల్ కాంబోలో సినిమా
X

నాగార్జున, అఖిల్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం కొత్త కాదు. అఖిల్ మొదటి చిత్రంలో నాగ్ నటించాడు. ఇక మనం సినిమాలో కూడా అఖిల్-నాగ్ కలిసి కనిపించారు. అయితే అఖిల్ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ ఎప్పుడూ చేయలేదు నాగార్జున. వీళ్లిద్దరి కాంబినేషన్ లో పక్కా మల్టీస్టారర్ రాలేదు.

ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. అఖిల్ తో ఓ సినిమా చేస్తానని నాగార్జున ప్రకటించాడు. అఖిల్, నాగార్జున హీరోలుగా ఓ సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన వర్క్ జరుగుతోందంట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

కర్నూల్ లో ది ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. నాగచైతన్య, అఖిల్ ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా వచ్చారు. ఈ వేదికపై మాట్లాడిన నాగార్జున, అఖిల్ తో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించాడు.

నాగార్జున-నాగచైతన్య కాంబినేషన్ అందరికీ తెలిసిందే. తాజాగా ఇద్దరూ కలిసి బంగార్రాజు సినిమా కూడా చేశారు. అంతకంటే ముందు మనం సినిమాలో నటించారు. అఖిల్ తో మాత్రం నాగార్జున, ఫుల్ లెంగ్త్ రోల్ ఎప్పుడూ చేయలేదు. అది ఇప్పుడు సాకారం కాబోతోంది.

First Published:  26 Sep 2022 2:31 PM GMT
Next Story