Telugu Global
Cinema & Entertainment

Nagarjuna | నా సామిరంగ క్రెడిట్ వాళ్లకే ఇస్తాను

Naa Saami Ranga - నాగార్జున హీరోగా నటించిన సంక్రాంతి సినిమా నా సామిరంగ. ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ ను కీలక సభ్యులకు ఆపాదించారు నాగ్.

Nagarjuna | నా సామిరంగ క్రెడిట్ వాళ్లకే ఇస్తాను
X

నాగార్జున తాజా చిత్రం ‘నా సామిరంగ’. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని దర్శకునిగా పరిచయమైన ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. నాగార్జునకు జోడిగా అషికా రంగనాథ్ నటించిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్, మిర్న మీనన్, రుక్సర్ ధిల్లాన్ కీలక పాత్రలు పోషించారు.

సంక్రాంతి కానుకగా జనవరి14న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తోందని అంటున్నారు నాగార్జున. ఈ సినిమా క్రెడిట్ ను ముందుగా కీరవాణికి ఇచ్చిన నాగార్జున, ఇప్పుడు అదే క్రెడిట్ ను మిగతా నటీనటులకు కూడా ఇస్తున్నారు.

"నరేష్ తో పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. తను చేసిన సీన్స్, డ్యాన్సులు, యాక్షన్ అద్భుతంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో తను ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు. రాజ్ తరుణ్ కూడా చక్కని నటన కనబరిచాడు. మిర్నా, రుక్సర్, షబ్బీర్, రావు రమేష్, నాజర్ అందరూ పాత్రల్లో ఒదిగిపోయారు. ఆషికా కి ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి. అలాంటి పాత్ర చేయడం అంత సులువు కాదు. తన పాత్రలోని రెండు లేయర్స్ ని చాలా అద్భుతంగా చేసింది. తనకి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుందని భావిస్తున్నాను."

ఇలా టీమ్ అంతా కలిసి పనిచేయడం వల్లనే కేవలం 3 నెలల్లో సినిమా రెడీ చేశామని, ఇది తన ఒక్కడి గొప్పదనం కాదని అంటున్నాడు నాగ్.

First Published:  15 Jan 2024 10:55 AM GMT
Next Story