Telugu Global
Cinema & Entertainment

NagaChaitanya | చైతూ ఓటీటీ ఎంట్రీ హిట్

NagaChaitanya - కెరీర్ లో తొలిసారి ఓటీటీలో అడుగుపెట్టాడు నాగచైతన్య. అతడి ఓటీటీ డెబ్యూ హిట్టయింది.

NagaChaitanya | చైతూ ఓటీటీ ఎంట్రీ హిట్
X

ఎట్టకేలకు దూత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కినేని నాగచైతన్య నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్కినేని అభిమానులంతా ప్రస్తుతం ఓటీటీకి అతుక్కుపోయారు.

వార్తాపత్రికను ప్రారంభించబోతున్న ఒక పరిశోధనాత్మక జర్నలిస్ట్ జీవితాన్ని దూత సిరీస్ లో చూపించారు. రహస్యంగా ఉంచిన ఓ నేరానికి సంబంధించిన వలలో అతడు చిక్కుకుంటాడు. ఆ ఊహించని భయంకరమైన సంఘటనల నుండి అతడు ఎలా బయటపడ్డాడనేది స్టోరీ. నాగచైతన్య జర్నలిస్టుగా నటించిన ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించాడు.

మనం, థాంక్యూ వంటి తెలుగు చిత్రాలలో కలిసి పనిచేసిన చైతూ-విక్రమ్ కుమార్.. దూతతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. వీళ్లిద్దరూ ఈ సిరీస్ తో హిట్ కొట్టారు. ప్రతి ఎపిసోడ్ ను నెటిజన్లు ఆస్వాదిస్తున్నారు. ఇందులో ఇచ్చిన ట్విస్టులు అందర్నీ కట్టిపడేస్తున్నాయి.

పార్వతి ఈ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. సూపర్ ‌నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన దూతలో ప్రియా భవానీ శంకర్, ప్రాచీ దేశాయ్ కీలక పాత్రలు పోషించారు.

First Published:  1 Dec 2023 4:50 PM GMT
Next Story