Telugu Global
Cinema & Entertainment

Custody - కస్టడీ మూవీ ట్రయిలర్ రివ్యూ

Custody Movie Trailer - మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్టు కస్టడీ మూవీ నుంచి ట్రయిలర్ లాంచ్ అయింది. ఎలా ఉందో చూద్దాం.

Custody - కస్టడీ మూవీ ట్రయిలర్ రివ్యూ
X

నాగచైతన్య హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం కస్టడీ. మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. టీజర్, పాటలు ప్రోమోలు మంచి అంచనాలను నెలకొల్పాయి. తాజాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ట్రైల‌ర్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతోంది. హీరో, విలన్ ని రక్షించడం, అతనిని చనిపోనివ్వకుండా చేయడం కథాంశం. ఈ ప్రాసెస్ మొత్తం ట్రయిలర్ లో ఉత్కంఠభరితంగా ఉంది. నాగచైతన్య చట్టానికి కట్టుబడి ఉండే కానిస్టేబుల్‌గా కనిపించాడు. అతడికి లవ్ ప్రాబ్లమ్ కూడా ఉంది. ప్రేమించిన అమ్మాయి మరొక వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేయిస్తున్నారు. మరోవైపు ఒక నేరస్థుడిని కోర్టు ముందు హాజరుపరచాలి.

సమాజంలో శక్తివంతమైన వ్యక్తులపై పోరాడే అండర్ డాగ్ పాత్రలో నాగచైతన్య నటించాడు. అతడి లుక్స్ బాగున్నాయి. హీరోయిన్ కృతి శెట్టికి మంచి పాత్ర దక్కినట్టు, ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి ముఖ్య పాత్రల్లో కనిపించారు.

థ్రిల్లర్‌లు తీయడంలో వెంకట్ ప్రభు మాస్టర్. కస్టడీ సినిమాను కూడా అదే స్థాయిలో తీశాడనే విషయం ట్రైలర్ చూస్తే అర్థమౌతుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు మాస్ట్రో ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించారు.



First Published:  6 May 2023 2:51 AM GMT
Next Story