Telugu Global
Cinema & Entertainment

Custody Movie - నాగచైతన్య సినిమా టీజర్ రెడీ

Custody Teaser - నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా కస్టడీ. ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ లాక్ అయింది.

Custody Movie - నాగచైతన్య సినిమా టీజర్ రెడీ
X

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి

ఈ నెల 16న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో బాగుంది. నదిలో జైలు..ఆ జైలు నుంచి తనని తాను విడిపించుకొని బయటికి వస్తున్న నాగచైతన్య వీడియో చాలా క్యురియాసిటీని పెంచింది. ఈ టీజర్ వీడియోలో నాగచైతన్య ఖాకీ లో కనిపించాడు.

ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అరవింద్ స్వామి కీలక పాత్రలో కనిపించనున్నాడు. ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో శరత్‌కుమార్, సంపత్ రాజ్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.

నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అత్యున్నత నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్నారు. అబ్బూరి రవి డైలాగ్స్‌ రాస్తున్నాడు. కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.



First Published:  13 March 2023 4:47 PM GMT
Next Story