Telugu Global
Cinema & Entertainment

Custody Movie - నాగచైతన్య సినిమా షూట్ పూర్తి

NagaChaitanya's Custody Movie - నాగచైతన్య హీరోగా నటిస్తున్న సినిమా కస్టడీ. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయింది.

Custody Movie - నాగచైతన్య సినిమా షూట్ పూర్తి
X

నాగ చైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా 'కస్టడీ. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పుర్తయింది. దీనికి సంబధించిన వీడియోని టీం పంచుకుంది. దర్శకుడు వెంకట్ ప్రభు కట్ చెప్పి.. ‘’చైతు మా కస్టడీ నుంచి ఇక నీకు విడుదల’ అని చెప్పగా.. ‘మీ అందరినీ మే 12న కస్టడీలోకి తీసుకుంటాం. థియేటర్ లో కలుద్దాం’ అని నాగచైతన్య, కృతి శెట్టి చెప్పడం ఆకట్టుకుంది.

‘కస్టడీ’ కి సంబంధించిన ప్రతి అప్‌డేట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే విడుదల గ్లింప్స్ తో పాటు, నాగ చైతన్య, కృతి శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్‌లు ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో అరవింద్ స్వామి విలన్ గా నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

నాగచైతన్య కెరీర్‌లో అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ రాజా కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

First Published:  25 Feb 2023 12:22 PM GMT
Next Story