Telugu Global
Cinema & Entertainment

NagaChaitanya - చందు మొండేటి దర్శకత్వంలో చైతూ

NagaChaitanya - త్వరలోనే కొత్త సినిమా ప్రకటించబోతున్నాడు చైతూ. చందు మొండేటితో మరోసారి వర్క్ చేయబోతున్నాడు.

NagaChaitanya - చందు మొండేటి దర్శకత్వంలో చైతూ
X

కార్తికేయ 2 తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ డెలివరీ చేసిన దర్శకుడు చందూ మొండేటి. ఇప్పుడీ డైరక్టర్ తన నెక్స్ట్ సినిమాకు రెడీ అవుతున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తన తదుపరి సినిమా చేయబోతున్నాడు. ఇందులో నాగచైతన్య హీరోగా నటించే అవకాశం ఉంది.

గతంలో చైతూ, చందూ కాంబినేషన్ లో ‘సవ్యసాచి’ అనే సినిమా వచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఆ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది. దీంతో తమ కాంబోలో రాబోతున్న రెండో సినిమా విషయంలో చందూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఇప్పటికే స్టోరీ లాక్ చేసిన

ఇటీవలే స్టోరీ లాక్ అయిన ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గీతా ఆర్ట్స్ 2 పై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించనున్న ఈ మూవీ జులై లేదా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. త్వరలోనే ఈ కాంబో మూవీ ఎనౌన్స్ మెంట్ రానుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య, శివనిర్వాణ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు.

చందు మొండేటి, నాగచైతన్య కాంబినేషన్ ను నిర్మాత అల్లు అరవింద్ చాన్నాళ్ల కిందటే పరోక్షంగా వెల్లడించారు. ఓ సినిమా ఫంక్షన్ కు హాజరైన అరవింద్, గీతాఆర్ట్స్2 బ్యానర్ లో నెక్ట్స్ సినిమా చందు మొండేటితోనే ఉంటుందని స్పష్టం చేశారు.

First Published:  22 Jun 2023 12:29 PM GMT
Next Story