Telugu Global
Cinema & Entertainment

Custody Movie - డబ్బింగ్ మొదలుపెట్టిన నాగచైతన్య

Nagachaitanya Custody Movie - కస్టడీ మూవీ డబ్బింగ్ వర్క్ మొదలైంది. హీరో నాగచైతన్య తన క్యారెక్టర్ కు డబ్బింగ్ చెబుతున్నాడు.

Custody Movie - డబ్బింగ్ మొదలుపెట్టిన నాగచైతన్య
X

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'కస్టడీ. తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి.

ఇందులో భాగంగా తాజాగా కస్టడీ డబ్బింగ్ పనులు మొదలయ్యాయి. నాగచైతన్య స్టూడియోలో డబ్బింగ్ చెబుతున్న ఫోటోని షేర్ చేశాడు. 'నాగచైతన్య డబ్బింగ్ మొదలుపెట్టారు. త్వరలోనే టీజర్ అప్ డేట్' అంటూ మేకర్స్ ప్రకటించారు.

ఈ చిత్రంలో చైతూ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇంతకుముందు వీళ్లిద్దరూ కలిసి బంగార్రాజు సినిమా చేశారు. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. శరత్‌కుమార్, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.

నాగచైతన్య కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా వస్తోంది కస్టడీ. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  7 March 2023 12:24 PM GMT
Next Story