Telugu Global
Cinema & Entertainment

NagaChaitanya | దూత వెబ్ సిరీస్ ఐడియా కాదంట

NagaChaitanya - కెరీర్ లో తొలిసారి దూత అనే వెబ్ సిరీస్ చేశాడు నాగచైతన్య. నిజానికి ఇది వెబ్ సిరీస్ ఐడియా కాదంటున్నాడు ఈ హీరో.

NagaChaitanya | దూత వెబ్ సిరీస్ ఐడియా కాదంట
X

దూత వెబ్ సిరీస్ తో ఓటీటీలో అడుగుపెడుతున్నాడు నాగచైతన్య. ఈ కాన్సెప్ట్ ను ముందుగా వెబ్ సిరీస్ అనుకోలేదంటున్నాడు చైతూ. సినిమాగానే చేద్దామనుకున్నాడట. కానీ ఎందుకు నిర్ణయం మార్చుకోవాల్సి వచ్చిందో వెల్లడించాడు.

"ఈమ‌ధ్య వెబ్ సిరీస్‌లkg విప‌రీత‌మైన క్రేజ్ తీసుకొస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వ‌స్తోంది. అందుకే నేను కూడా చాలా రోజుల నుంచి ఓ మంచి వెబ్ సిరీస్ కోసం ఎదురుచూస్తున్నా. విక్రమ్ కుమార్ చేసిన 24 లాంటి కాన్సెప్ట్స్ నాకు చాలా ఇష్టం. అలాంటి కథ వస్తే చేద్దామనుకున్నాను. అలాంట‌ప్పుడు విక్రమ్ కె.కుమార్ 'దూత' లాంటి యూనిక్ కాన్సెప్ట్ తో వ‌చ్చారు. అయితే ఇది వెబ్ సిరీస్ కోసం అని చెప్పలేదు. కాన్సెప్ట్ చాలా న‌చ్చింది. వెబ్ సిరీస్ అయితే బాగుంటుంద‌నిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లో ఎక్కువ స్పేస్ ఉంటుంది. చాలా విష‌యాలు డిటైల్డ్ గా చెప్పొచ్చు. సినిమా అయితే రెండన్నర గంట‌ల్లో మొత్తం క‌థ చెప్పేయాలి. అందుకే వెబ్ సిరీస్ లో అయితేనే ఈ క‌థ‌కు న్యాయం జ‌రుగుతుంద‌నిపించింది."

దూత వెబ్ సిరీస్ కు సీజన్-2, సీజన్-3 ఐడియాలు కూడా రెడీగా ఉన్నాయని ప్రకటించాడు నాగచైతన్య. సీజన్-1 హిట్టయితే తప్పకుండా మిగతా సీజన్లు వస్తాయని క్లారిటీ ఇచ్చాడు. డిసెంబర్ 1 నుంచి దూత వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వస్తోంది.


ఇకపై సినిమాలతో కూడా ఓటీటీ ప్రయాణాన్ని కూడా కొనసాగిస్తానంటున్నాడు నాగచైతన్య. అయితే ఓటీటీ కాన్సెప్ట్ మాత్రం చాలా కొత్తగా, ఎక్సయిటింగ్ గా ఉండాలని అంటున్నాడు.

First Published:  23 Nov 2023 4:57 PM GMT
Next Story