Telugu Global
Cinema & Entertainment

Naga Chaitanya: ఏజెంట్ సినిమాపై చైతూ రియాక్షన్

Naga Chaitanya: అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయింది. ఇప్పుడీ సినిమాపై నాగచైతన్య స్పందించాడు.

Naga Chaitanya: ఏజెంట్ సినిమాపై చైతూ రియాక్షన్
X

అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది. కొన్ని రోజుల గ్యాప్ లోనే అన్నయ్య నాగచైతన్య సినిమా వస్తోంది. అదే కస్టడీ మూవీ. ఈ సినిమా ప్రమోషన్ లో చైతూకి ఏజెంట్ పై ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో ఆ సినిమాపై ఎందుకంత వ్యతిరేకత వచ్చిందనేది ఆ ప్రశ్న.

దీనిపై నాగచైతన్య నిజాయితీగా స్పందించాడు. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని అంగీకరించిన నాగచైతన్య, సోషల్ మీడియాలో ఆ సినిమాపై మరీ అంత కోపం ఎందుకు ప్రదర్శించారో తనకు అర్థం కాలేదన్నాడు.

"సోషల్ మీడియా అనేది నాకు ఎప్పటికీ అర్థం కాదు. అది నాకెప్పుడూ ఓ క్వశ్చన్ మార్క్. ఆ ప్రపంచం నాకు ఎప్పుడూ కొత్తే. అలా అని దాంతో మనం ఫైట్ చేయలేం. ఇప్పటి కాలం ఇది. ప్రపంచం అంతా సోషల్ మీడియా చుట్టూనే తిరుగుతోంది. దానికి మనం అలవాటు పడాల్సిందే. లేకపోతే వెనకబడిపోతాం. ఇక ఏజెంట్ సినిమా విషయానికొస్తే, సోషల్ మీడియాలో ఎందుకంత వ్యతిరేకత వచ్చిందో నాకైతే అర్థం కావడం లేదు."

ఇలా ఏజెంట్ సినిమాపై స్పందించాడు అఖిల్. కష్టపడి సినిమాలు చేయడం వరకే తమ బాధ్యత అని, దాని రిజల్ట్ ను తాము నియంత్రించలేమని అన్నాడు నాగచైతన్య. ఏజెంట్ సినిమాతో నిరాశ చెందిన అక్కినేని ఫ్యాన్స్, కస్టడీ సినిమాతో హ్యాపీ ఫీలవుతారని అంటున్నాడు ఈ అక్కినేని హీరో.

First Published:  9 May 2023 9:08 AM GMT
Next Story