Telugu Global
Cinema & Entertainment

Naga Chaitanya | దూత వచ్చేస్తున్నాడు

Naga Chaitanya - కెరీర్ లో తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేశాడు నాగచైతన్య. చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ఆ సిరీస్ ఇప్పుడు దాదాపు రెడీ అయింది.

Naga Chaitanya | దూత వచ్చేస్తున్నాడు
X

అక్కినేని నాగచైతన్య దూత వెబ్ సిరీస్ ఓటీటీ విడుదలకు రంగం సిద్ధమవుతోంది. చాలా నెలలుగా ఈ సిరీస్‌ని రూపొందించే ప్రక్రియ కొనసాగుతోంది. అమెజాన్ సిరీస్‌ని వదులుకుందని అంతా అనుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో దూత నుంచి అప్ డేట్ వచ్చింది.

నాగ చైతన్య, విక్రమ్ కె కుమార్ కలిసి పనిచేసిన థాంక్యూ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ముందే, వారిద్దరూ దూత అనే వెబ్ సిరీస్‌ చేశారు. ఈ సినిమా షూటింగ్ చాన్నాళ్ల కిందటే పూర్తయింది. నాగచైతన్య ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

తాజా సమాచారం ప్రకారం, దూత సినిమా డబ్బింగ్ పనులు నడుస్తున్నాయి. ఒక్కో భాషలో విడివిడిగా డబ్బింగ్ చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో నాగచైతన్య డబ్బింగ్ చెప్పాడు. మరో 4 భాషల్లో వేరే వాళ్లతో నాగచైతన్యకు డబ్బింగ్ చెప్పించారు. నాగచైతన్య బర్త్ డే స్పెషల్ గా దూత వెబ్ సిరీస్ ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు.

దీనికి సంబంధించి అమెజాన్ కసరత్తు మొదలుపెట్టింది. దూత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొలిక్కి రావడంతో, మంచి డేట్ కోసం చూస్తోంది. ఆ తేదీకి నాగచైతన్య పుట్టినరోజుకు కాస్త లింక్ సెట్ చేసే ఆలోచనలో కూడా ఉంది. అయితే ఇంటర్నేషనల్ లెవెల్లో కంటెంట్ ను ప్రవేశపెట్టే, అమెజాన్, నాగచైతన్య పుట్టినరోజు తేదీని కన్సిడర్ చేయకపోవచ్చు.

దూత మొదటి సీజన్‌లో 8 ఎపిసోడ్‌లు ఉంటాయి. ఒక్కొక్కటి దాదాపు 40 నిమిషాల రన్-టైమ్‌తో ఉంటుంది. ఫైనల్ కాపీ ఇప్పుడిప్పుడే రెడీ అవుతోంది. యూనిట్ ఫైనల్ కాపీ రెడీ చేసిన తర్వాత, అమెజాన్ కు చెందిన క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది సిరీస్ మొత్తాన్ని చెక్ చేస్తారు. తమ ప్రమాణాలకు అనుగుణంగా అంతా ఉందని నిర్థారించుకున్న తర్వాత ప్రచారం ప్రారంభిస్తారు.

First Published:  1 Nov 2023 5:08 PM GMT
Next Story