Telugu Global
Cinema & Entertainment

Custody: నాగచైతన్య సినిమా రిలీజ్ డేట్

Custody Movie: నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Custody: నాగచైతన్య సినిమా రిలీజ్ డేట్
X

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 'కస్టడీ'. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చేసిన "కస్టడీ" టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ లుక్ పోస్టర్ లో నాగ చైతన్య ఎగ్రెసివ్ గా కనిపించి మెప్పించాడు.

తాజాగా "కస్టడీ" థియేట్రికల్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు. వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ.. వచ్చే ఏడాది మే 12 న ప్రపంచవ్యాప్తంగా కస్టడీ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది కస్టడీ.

నాగచైతన్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి విలన్ గా కనిపిస్తాడు. మరో కీలక పాత్రలో ప్రియమణి కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, వెన్నెల కిషోర్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దిగ్గజ తండ్రీకొడుకులు సంగీత ద్వయం ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

First Published:  29 Dec 2022 3:19 AM GMT
Next Story