Telugu Global
Cinema & Entertainment

Custody Movie: నాగచైతన్య యాక్షన్ మోడ్

Custody Movie: న్యూ ఇయర్ కానుకగా తన కొత్త సినిమా నుంచి వీడియో రిలీడ్ చేశాడు చైతూ. కొత్త ఏడాదిలో కొత్త యాక్షన్ లుక్ చూపించాడు.

Custody Movie: నాగచైతన్య యాక్షన్ మోడ్
X

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌ లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం 2 నెలల క్రితమే సెట్స్ పైకి వెళ్లింది. 'కస్టడీ' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇటివలే ఈ సినిమా రిలీజ్ డేట్‌ ని ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదలవుతోంది. న్యూ ఇయర్ కి స్వాగతం పలుకుతూ.. ఈరోజు మేకర్స్ ఒక స్పెషల్ గ్లింప్స్ ని విడుదల చేశారు.

గ్రిప్పింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఏరియల్ షాట్‌ లతో టీజర్ ప్రారంభమైంది. ట్రైన్ దూసుకురావడం, కార్లు పేలడాన్ని రివర్స్ లో చూపించడం, నాగచైతన్య విలన్స్ కు పవర్ ఫుల్ పంచ్‌ లు ఇస్తూ యాక్షన్‌ లోకి దిగడం గ్లింప్స్ లో ఉంది.

నాగచైతన్య యాక్షన్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఈ గ్లింప్స్ కు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని అందించారు. నాగ చైతన్య కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన చిత్రాల్లో కస్టడీ ఒకటి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు



First Published:  1 Jan 2023 1:09 PM GMT
Next Story