Telugu Global
Cinema & Entertainment

Custody Movie - కస్టడీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Custody Movie 1st single - నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజైంది. ఎలా ఉందో చూద్దాం..

Custody Movie - కస్టడీ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
X

నాగచైతన్య, వెంకట్ ప్రభు క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతున్న తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘కస్టడీ’. ఈ ఏడాది విడుదలవుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో ఇదొకటి. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సినిమా మ్యూజికల్ జర్నీ మొదలైంది.

ఫస్ట్ సింగిల్ హెడ్ అప్ హై లిరికల్ వీడియో రిలీజైంది. లెజెండరీ కంపోజర్ ఇళయరాజా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హెడ్ అప్ హై లిరిక్స్ బాగున్నాయి. పోలీసుల గొప్పదనాన్ని తెలిపేలా ఉంది ఈ సాంగ్.

అరుణ్ కౌండిన్య, అసల్ కోలార్‌లతో పాటు యువన్ శంకర్ రాజా స్వయంగా పాడిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. పాట మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంది. సాహిత్యం పోలీసుల గొప్పతనాన్ని వర్ణిస్తుంది.

నాగచైతన్య తన డాన్స్ తో ఆకట్టుకున్నాడు. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య సరసన కృతిశెట్టి హీరోయిన్. కస్టడీ మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది



First Published:  11 April 2023 2:16 PM GMT
Next Story