Telugu Global
Cinema & Entertainment

Nagachaitanya - వెబ్ సిరీస్ కోసం భారీ రెమ్యూనరేషన్

Naga Chaitanya - తన కెరీర్ లోనే అత్యథిక పారితోషికం తీసుకున్నాడు నాగచైతన్య. ఇంతకీ చైతూ రెమ్యూనరేషన్ ఎంత?

Nagachaitanya - వెబ్ సిరీస్ కోసం భారీ రెమ్యూనరేషన్
X

హీరో నాగచైతన్య దూత వెబ్ సిరీస్ పై చాలా నమ్మకంగా ఉన్నాడు. కెరీర్ లో తొలిసారి వెబ్ సిరీస్ చేసిన ఈ హీరో, దూత తనకు ఓ కొత్త ఇమేజ్ తెచ్చిపెడుతుందని నమ్ముతున్నారు. ఈ వెబ్ సిరీస్ అతడికి ఎలాంటి ఇమేజ్ తెచ్చిపెడుతుందో తెలియదు కానీ, డబ్బులు మాత్రం బాగానే తెచ్చిపెట్టింది.

కెరీర్ లోనే ది బెస్ట్ ఎమౌంట్ ను దూత వెబ్ సిరీస్ కోసం అందుకున్నాడు నాగచైతన్య. తాజా సమాచారం ప్రకారం, ఈ సిరీస్ కోసం నాగచైతన్య 12 కోట్ల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ సిరీస్ కు సీజన్-2 కూడా ఎనౌన్స్ చేశారు. తన ఇంటర్వ్యూల్లో భాగంగా దర్శకుడు విక్రమ్ కుమార్, సీజన్-2 ప్రకటించాడు. అలా సీజన్-2 కోసం కూడా మరో 12 కోట్ల రూపాయలు అందుకోబోతున్నాడు చైతూ.

మొత్తంగా దూత సిరీస్ నుంచి నాగచైతన్యకు 24 కోట్ల రూపాయల మొత్తం పారితోషికం కింద రాబోతోంది. నాగచైతన్య కెరీర్ లోనే బిగ్ ఎమౌంట్ ఇది. ప్రస్తుతం అతడు తన సినిమాలకు 8 నుంచి 10 కోట్ల రూపాయల మధ్య తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అలాంటిదే వెబ్ సిరీస్ తో 24 కోట్లు అంటే చాలా పెద్ద ఎమౌంట్ కింద లెక్క.

మరికొన్ని రోజుల్లో చందు మొండేటి దర్శకత్వంలో సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు చైతూ. ఈ సినిమాకు తండేల్ అనే టైటిల్ పెట్టారు. సాయిపల్లవి హీరోగా నటించనున్న ఈ సినిమాను 3 నెలల్లో పూర్తిచేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.

First Published:  30 Nov 2023 3:49 PM GMT
Next Story